bb2
bb3
ashram1
bannerdd
bb4
previous arrow
next arrow


కాశీ క్షేత్రంలో నీ శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం గత మార్చ్ నుంచి కరోనా మహమ్మారి కారణంగా కాశీలో చాలా మంది యాత్రికులు ఇరుక్కు పోవటం వలన మన ఆశ్రమం తరపున అందరికీ ఉచిత వసతి, భోజనం ఏర్పాటు చేసి వారిని వారి వారి ఇంటికి బస్సుల ద్వారా పంపించే ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం యాత్రికులకు సేవ చేయలేక పోయాము. ప్రస్తుతం గవర్నమెంట్ సుచలన ప్రకారం కాశీలో అన్ని దేవాలయాలు తెరిచారు మళ్లీ మన ఆశ్రమం కూడా యాత్రికుల సేవలో ముందుకు వచ్చింది . మన ఆశ్రమం తరపున కాశీకి వచ్చే యాత్రికులకు ఆశ్రమం తగు జాగ్రత్తలు తీసుకుంది .మైన్ గేట్ దగ్గర సేనిటైజేశన్ కెనాల్.రోజుకి రెండు సార్లు కెమికల్ ద్వారా స్ప్రే చేయుట.రోజుకి రెండు సార్లు సాంబ్రాణి పొగ వేయుట.మాస్క్ ధరించి ఆశ్రమం లో నికీ ప్రవేశం .భోజనం దగ్గర రెండు గజాల దూరం పాటించుట.రూమ్ ఖాళీ అయిన తరువాత రూముని సేనిటైజ్ చేయుట తగు జాగ్రత్తలు ఆశ్రమం తరపున తీసుకున్నాం.

పూర్తి వివరాలకు క్లిక్ చెయ్యండి https://www.youtube.com/watch?v=Zdkuis4G9Dg

వి వి సుందర శాస్త్రీ
మేనేజింగ్ ట్రస్టీ
శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం
వారణాసి

శ్రీ రామ తారక ఆంధ్రాశ్రమం, వారణాశి ఒక పరిచయం

హిందూ దేశమందలి ఆంధ్ర రాష్ట్రము నుండియే కాక, యావద్భారతావనిలోని ఏ ప్రాంతమునుండిగాని, ప్రపంచమందలి ఏ ప్రదేశము నుండి గాని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమయిన శ్రీ కాశీ క్షేత్ర గంగా తీర్థమును దర్శింపగోరు వారికి తమ మిత్రుల సహా, కాశీ యందలి మన ఆంధ్రాశ్రమమున విడిది చేయడమనునది.

కాశీ క్షేత్ర దర్శన కుతూహలముతో వ్యయ ప్రయాసలకోర్చి క్షేత్రము చేరిన వెంటనే ప్రపథమమున కావలసినది ఆవాసము. ఆ పై స్నానము. తదుపరి క్షేత్రపాలక ప్రధానదైవ దర్శనానంతరము భోజనవిశ్రాంతులు.

ఈ క్రమమున మొదటిది ఆవాసము అనగా వసతి. సమీపకాలమున తీర్థయాత్రలు కూడను విహార యాత్రలుగ మారిన కారణమున కాశీలో వసతి కొరకు మరిన్ని వసతి గృహములేర్పడినప్పటికిని, 50 సంవత్సరముల కాలము తీర్థయాత్రా నియమములను పాటించుచు ఆశ్రమ వాతావరణ పరిరక్షణతో నడుప బడుచున్న “శ్రీ రామతారక ఆంధ్రాశ్రమము” ప్రత్యేకముగ ఆంధ్రాభిమానము, తదుపరి సర్వ జనాభిమానముతో శ్రీ కాశీ కేదారఖండమందలి మానససరోవర ఘట్టమందు నిర్మింపబడినది. స్థలమహాత్మ్యమే దీని అభ్యున్నతికి కారణమని చెప్పక తప్పదు.

 

పూజలు వివరములు
శ్రీరామ నవమి పూజ– సీతారామ కళ్యాణము, లక్షతులసిపూజ, లశ్ర కుంకుమార్చన, శ్రీరామ పట్టాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్షపత్రిపూజ, అన్నదానము, తెప్పోత్సవము, గంగపూజ, పవళింపుసేవలు జరుపబడును. విరాళము. రూ.11,116/- UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO 062010011004863 IFS CODE UBIN0806200
మహాశివరాత్రి పూజ- ఆరోజు ఉదయం నుండి మరునాడు ఉదయం వరకు అభిషేకములు రాత్రికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మరునాడు బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము, ఋత్విక్కులకు సత్కారము జరుపబడును. విరాళము రూ.,1116/- UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO 062010011004866 IFS CODE CODE UBIN0806200
కార్తీక పౌర్ణమి పూజ– మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునకు సహస్ర బిల్వార్చన, అన్నపూర్ణ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ఆకాశదీపము, ఆలయము చుట్టూ దీపాలంకరణ, బ్రాహ్మణ సత్కారము జరుపబడును. విరాళము రూ.1,116/- UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO 062010011004864 IFS CODE UBIN0806200
గణపతి నవరాత్రి ఉత్సవమలు– భాద్రపద శుక్ల చతుర్ది వినాయకచవితి నుండి 9 రోజులు ప్రత్యేక పూజలు జరుపబడును. విరాళము రూ.1116/-.UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO 062010011015648 IFS CODE UBIN0806200

 

అన్నదాతలు ఇవ్వవలసిన వివరములు

1.దాత పేరు-
2.ఎవరి పేరున అన్నదానము చేయవలసినది-
3.గోత్రము-
4.ఏమాసము లో ఏతిథి (తేది) రోజున చేయవలసినది-
5.పూర్తి అడ్రసు-
దాతలు తమ విరాళములను “SRI RAMATARAKA KUSUMAMBA KASI NITYANNADANA PADHAKAM, VARANASI”  పేరున డి.డి  రూపమున వారణాశి లో చెల్లుబడి అగునట్లు తీసి పంప గలరు.
లేదా : UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200 ద్వారా జమ చేసి పై వివరములు తెలుపుతూ ఇ-మెయిల్ పంప గలరు

విరాళము లిచ్చిన దాతలకు ఇన్ కంటాక్స్ సెక్షన్ 80జి  ప్రకారము రాయతీ కలదు. దాతలు ఆధార్ నం. కాని పాన్ నం. కాని తప్పనిసరిగా జతపరచవలెను

Translate »