bb2
bb3
ashram1
bannerdd
bb4
previous arrow
next arrow

శ్రీ వ్యాస ప్రణీత స్కంద పురాణాంతర్గత కాశీ ఖండము 77 వ అధ్యాయము 58 వ శ్లోకము
శ్లో.     ఉత్తమం మానసం తీర్థం జనే ఖ్యాతి మిదంగతః
అత్రపూర్వం జపస్నానమాత్రేణైవ విశుధ్యతి.
తా. తపోభూమి యగు కాశీ క్షేత్రమున ఉత్తమోత్తమ స్థానమై, అచట చేయు జప స్నానముల వలన జనులు  పరిశుద్ధులగుదురు. హిమాలయ పర్వతమందలి కైలాసమున గల బ్రహ్మమానస సరోవరము శ్రీ పరమాత్మ అచటినుండి కాశీ చేరి, కాశీయే తన ఆనందకారణమని ప్రకటించినందున శ్రీ బ్రహ్మమానస సరోవరము గూడ కాశీకి చేరినది.

దయామయుడగు శ్రీరామచంద్రమూర్తి యనుగ్రహమున 1959వ సంవత్సరమునందు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రముఖులగు కీ.శే. డా. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, కీ.శే. శ్రీ వి.వి. గిరిగారు, కీ. శే. డా. బూర్గుల రామకృష్ణారావుగారు, కీ.శే. శ్రీమాన్ అనంతశయనం అయ్యంగారు, కీ.శే. శ్రీ నేతి సుబ్రహ్మణ్యం గారు వగైరా పెద్దల సలహా సంప్రతింపులతో ప. ప. శ్రీ శ్రీ శ్రీ రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారి సంకల్పము సిద్ధించి, అనేక ఆంధ్ర వదాన్యుల ద్రవ్య సహాయముతో శ్రీకాశీ క్షేత్రమున, కేదార ఖండమందలి గంగానది ఒడ్డునగల శ్రీ మానస సరోవరమను 1500 గజముల వైశాల్యముగల పుణ్య స్థలమును అప్పటి రు. 20,000/- లకు జంగమ వాడి మఠము యజమాన్యమునుండి పొంది ది. 9.5.1959 న దస్తావేజు రిజిష్టరు చేయబడినది.

oldimage
asrammam1

“శ్రీరామతారక ఆంధ్రాశ్రమ” నిర్మాణమునకు ది. 12.11.1959 వ తేదీ (కార్తీక శుద్ధ ద్వాదశి) గురువారము ఉదయం గం. 7.30 ని. లకు అప్పటి ఉత్తరప్రదేశ్ గవర్నరుగానున్న ఆంధ్రప్రముఖులు కీ.శే. శ్రీ వి.వి. గిరిగారిచే వేదమంత్ర పురస్సరముగ మహావైభవముగ శంఖుస్థాపన మహోత్సవము జరుపబడినది. ఈ విషయము యావద్భారత దేశమందలి ఆంధ్రులకు తెలియుటకై ఆనాటి ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, హిందూ పత్రిక, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లు  గొప్పగా కొనియాడి ప్రచురించినవి.
ఈ ఆశ్రమ నిర్మాణ, నిర్వహణలకుగాను కీ.శే. డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు ది. 1.4.1960 తేదీన శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతీస్వామివారు ప్రముఖులుగాను మరి ఆరుగురు సభ్యులతో కూడిన ట్రష్టుడీడు రిజిష్టరు చేయించినారు.
ట్రష్టు డీడు సభ్యులు

  1. ప.ప. శ్రీశ్రీశ్రీ రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు
  2. డా. బూర్గుల రామకృష్ణారావుగారు (మాజీ గవర్నరు, ఉ. ప్ర)
  3. శ్రీ పంచాగ్నుల సూర్యనారాయణగారు (మద్రాసు)
  4. శ్రీ జె.వి. సోమయాజులు గారు (తిరుపతి దేవస్థానం)
  5. శ్రీ జి.యన్. రాజుగారు (సిరీస్ లేబరేటరీస్, విజయవాడ)
  6. శ్రీ కర్పూరపు వేంకటనారాయణగారు (గుంటూరు)
  7. శ్రీ సి.వి.యస్. నరసింహారావుగారు (విజయవాడ)
bldg
GOD

శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు ఆశ్రమ కట్టడమునకుగాను మేస్త్రీలు, కూలీలతో వారి భాషలలో మాట్లాడి పనులు చేయించుకొనుచు, గుమాస్తాలను నియమించి ఎంతో శ్రమతో ఆశ్రమము నిర్మింపగా, ట్రష్టీలలో చాలా సన్నిహితులనుండియు, ఆశ్రమము ఇరువైపులనుండు వారినుండియు వాజ్ఞ్మూలముగను, వ్రాతపూర్వకముగను, కోర్టు ద్వారాకూడాను ఎన్నో ఇబ్బందులనధిగమించి శ్రీస్వామివారి తపోబలము వలనను శ్రీ సీతారామచంద్రుల పరిపూర్ణ అనుగ్రహముచేతను, ఆశ్రమము మొదటి అంతస్థును రెండవ అంతస్థులో కొంతభాగాన్ని కట్టించి, అందు శ్రీసీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామి వారిని మందిరమున ప్రతిష్ఠింపజేసి, మానసేశ్వరస్వామిగా శివ ప్రతిష్ఠగావించిరి.

        ఆశ్రమ నిర్వహణ తమ తపోనిష్ఠకు భంగకరముగాకుండ గుమాస్తాలతో జరిపించుట కష్టతరముగా తలంచిన శ్రీశ్రీశ్రీ స్వామివారు, వేరు మార్గము గానక 1966 వ సం. లో వారి పూర్వాశ్రమ కనిష్ఠపుత్రులగు వేమూరి శ్రీరామచంద్రమూర్తిగారిని వారు అప్పుడు చేయుచున్న మిలిటరీ ఉద్యోగమును మాన్పించి సకుటుంబముగ కాశీకి రప్పించిరి. శ్రీరామచంద్రమూర్తిగారు ఆశ్రమ మేనేజరుగా బాధ్యత స్వీకరించి తండ్రికి తగిన బిడ్డగా, యాత్రీకులకు సకల సౌకర్యములు కల్పించుటయందు శ్రద్ధతో నిత్యము శ్రీ మానసేశ్వర, శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామివారి సేవలతో ఆశ్రమ నిర్వహణ బాధ్యత సమర్ధవంతముగ నిర్వహించిరి. అప్పటినుండి శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు తపోయోగ నిష్ఠులై వయోభారముచే ది. 12.12. 1983న కాశీలో వారు స్థాంపించిన ఆశ్రమమునందు శివసాయుజ్యము పొందిరి.

కాశీయాత్రచేయు ఆంధ్ర యాత్రిక భక్తులకు పెట్టని కోటగా వసతులు కల్పించుచున్న ఆంధ్ర ఆశ్రమమునకు స్వాములవారి సేవకు నిరంతర స్మరణ చిహ్నముగా వారి విగ్రహము ఆశ్రమములోని శివాలయమునకు దగ్గరలో కుటీరమందు స్థాపింపబడినది. శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతులవారిచే ఈ కార్యక్రమము 23.4.2000 సం. న నిర్వర్తించబడినది.
శ్రీ రామచంద్రమూర్తిగారు ఆశ్రమ పురోభివృద్ధికై అహరహము పాటుపడి సంకటములనెదుర్కొనుటకు శ్రీ గణపతిని ప్రార్థించి 1987 వ సంవత్సరమునుండి శ్రీరామనవమి ఉత్సవములు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములకు తోడుగ, వారి పెద్దకుమారుడైన శ్రీ వేమూరి వెంకట సుందరశాస్త్రిగారి ప్రోత్సాహముతో గణపతి నవరాత్ర మహోత్సవములారంభించి సమర్ధవంతముగ నిర్వర్తించుచుండిరి. ఈ కార్యక్రమము నిర్వరామముగా ఇప్పటివరకు జరుగుచునే యున్నది. ఈ ఉత్సవము 9 రోజులు ఉదయము సాయంత్రము గణపతి పూజలు, సాంస్కృతిక కార్యక్రమములతో సహా జరిపి చివరి రోజున ఊరేగింపుతో గణపతినిమజ్జనము గంగానదిలో జరుపబడుచున్నది.

        గణపతి నవరాత్రి ఉత్సవములతో పాటు, ఈ దిగువ పేర్కొన్న విశిష్ట కార్యక్రమములు భక్తి, శ్రద్ధలతో ఆశ్రమములో నిర్వహించబడుచున్నవి.
(అ)   శ్రీరామనవమి ఉత్సవము : 4 దినములు నిర్వహించబడుచున్నవి
శ్రీరామనవమినాడు శ్రీ సీతారామచంద్రుల కల్యాణము, రెండవ రోజున 10 మంది భక్తులతో లక్షతులసి అర్చన, సీతమ్మవారికి ముత్తయిదువులతో లక్షకుంకుమార్చన, మూడవ రోజు గంగాతీరమున అవబృధస్నానము, తదుపరి శ్రీరాములవారి పట్టాభిషేకము, అన్నపూర్ణా సమేత మానసేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, నాల్గవరోజు ఆంజనేయస్వామివారికి ఆకుపూజ, సాయంత్రము శ్రీరామచంద్రులవారికి తెప్పోత్సవము.
(ఆ) మహాశివరాత్రి పూజలు : మహాపర్వదినమైన మహాశివరాత్రి సమయమునందు నాలుగు యామములలోను అన్నపూర్ణ సమేత మానసేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన జరుపబడుచున్నది. రాత్రి అంతయు అనేక భక్తి కార్యక్రమములు సాగించుచు జాగరణ చేయుదురు.
(ఇ) కార్తీక మాస పూజలు : హరిహరులకిర్వురకు ప్రీతికరమైన కార్తీక మాసమునందు ఆంధ్రదేశము నలుమూలల నుండి భక్త సందోహము కాశీకి వచ్చి ఆశ్రమములో విడిది చేసి నిత్యము ఆశ్రమము ఆధ్వర్యములో మానసేశ్వరస్వామివారికి అభిషేకములు, కార్తీక దామోదర పూజ, లక్ష బిల్వార్చనల వంటి పూజలతో వారు తన్మయులగుచు ఆశ్రమమునకు నిత్య కల్యాణము, పచ్చ తోరణము శోభను తీసుకొని వత్తురు. ఈ మాసపు పూజలు ఆశ్రమ స్థాపననుండి నిరాటంకముగా సాగుచున్నవి.  కార్తీక పౌర్ణమినాడు లక్ష బిల్వార్చన శివ పార్వతుల కల్యాణము, భజన కార్యక్రమము జరుపబడును.
(ఈ) ధనుర్మాస పూజలు : శ్రీ రంగనాథునకు ప్రీతికరమైన ధనుర్మాసమునాడు మాసమంతయు వేకువ ఝామునే శ్రీరామమందిరమునందు ధనుర్మాస పూజలు, తీర్థ ప్రసాద వితరణ మున్నగు భక్తి కార్యక్రమములు నిర్విఘ్నముగా జరుగుచున్నవి. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనము, మందిర ప్రదక్షిణములు, భజనలు, అలంకారములు అ న్నియు నయనానందకరముగా సాగుచున్నవి.
(ఉ) సంధ్య హారతులు : 2009 మహాశివరాత్రి పర్వదినము నుండి, మేనేజింగు ట్రష్టీ శ్రీ సుందరశాస్త్రిగారి ఆధ్వర్యములో, ఆశ్రమములో వెలసియున్న రాధా కృష్ణ మందిరము, రామమందిరము, స్వాములవారి కుటీరము, రామనామ స్థూపము, శివాలయము, గంగాధర మూర్తి మరియు గంగామాతకు సంధ్య హారతులు నిర్వర్తింపబడుచున్నవి. యాత్రిక భక్తు ఆదరాభిమానములతో సలక్షణముగా జరుగుచున్నవి.

(ఊ) హోమములు : లోకకల్యాణార్ధము, యాత్రికులకు నిరంతర సేవచేయుచున్న ఆశ్రమము అభివృద్ధి కొఱకు ప్రతి మాస శివరాత్రనాడు రుద్రహోమము, ప్రతి శుక్ల అష్టమినాడు చండీ హోమము ఋత్విక్కుల సహాయముతో, కాశీ వాసుల, భక్త జనుల సహకారముతో జరుపబడుచున్నవి.

పూజలు వివరములు
శ్రీరామ నవమి పూజ
 సీతారామ కళ్యాణము, లక్షతులసిపూజ, లక్ష కుంకుమార్చన, శ్రీరామ పట్టాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్షపత్రిపూజ, అన్నదానము, తెప్పోత్సవము, గంగపూజ, పవళింపుసేవలు జరుపబడును. విరాళము. రూ.11116/-లు అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200

మహాశివరాత్రి పూజ-
ఆరోజు ఉదయం నుండి మరునాడు ఉదయం వరకు అభిషేకములు రాత్రికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మరునాడు బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము, ఋత్విక్కులకు సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200

కార్తీక పౌర్ణమి పూజ– 
మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునకు సహస్ర బిల్వార్చన, అన్నపూర్ణ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ఆకాశదీపము, ఆలయము చుట్టూ దీపాలంకరణ, బ్రాహ్మణ సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200

గణపతి నవరాత్రి ఉత్సవమలు భాద్రపద శుక్ల చతుర్ది వినాయకచవితి నుండి 9 రోజులు ప్రత్యేక పూజలు జరుపబడును. విరాళము రూ.1116/-. అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200

విరాళము లిచ్చిన దాతలకు ఇన్ కంటాక్స్ సెక్షన్ 80జి  ప్రకారము రాయతీ కలదు

        శ్రీ శ్రీరామచంద్రమూర్తిగారు తరచు ఆంధ్రదేశ పర్యటన గావించుచు వదాన్యులనాశ్రయించి సంపాదించిన ధనముతో శ్రీరామతారక ఆంధ్రాశ్రమమున రెండవ అంతస్థులోని గదులన్నియూ నిర్మించి మొత్తము రెండతస్థులలోనూ కలిపి వంటగది, లెట్రినుతో గల 45 సూట్లు, 71 విడి గదులు, మొదటి అంతస్థులోరామమందిరముపైన పెద్ద హాలును నిర్మించి మొత్తము 800 మంది యాత్రికులు బసచేయుటకు తగిన వసతి, బాత్‌రూములు, లెట్రినులతో యాత్రికుల సౌకర్యమే ధ్యేయముగ సేవచేయుచుండిరి. వారి ఆధ్వర్యములో జనరేటరు స్థాపింపబడి, లిఫ్టు సౌకర్యము కొరకు పనులు ప్రారంభించబడినవి.

        శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు తమ కుమారులగు చి. వెంకట సుందర శాస్త్రి, చి. వెంకట సీతారామ శాస్త్రి గారలకు ఆశ్రమ నిర్వహణలోని మెళకువలను నేర్పి వారిని తీర్చి దిద్దిరి. మధ్య కుమారుడగు చి. వెంకట విశ్వనాథ శాస్త్రికి సంగీత సాధనలో గల ఆసక్తిని గ్రహించి విజయనగర సంగీత కళాశాలయందు సంగీతము నేర్పించిరి. ఆ విధముగ తండ్రి, కుమారుల ఆధ్వర్యమున మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుచున్న సమయమున శ్రీరామచంద్రమూర్తి గారు వృధ్ధాప్యమున అస్వస్థులై ది. 20.7.2008 న శ్రీ విశ్వనాథ స్వామి వారిచే రామతారక మంత్రోపదేశము పొంది శివైక్యమందిరి.
తదనంతరము సుశిక్షితులగు అన్నదమ్ములు శ్రీశ్రీ రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు అవసాన కాలమున తమ విల్లులో వ్రాసి ట్రష్టు బోర్డుచే ఆమోదము పొందిన విధముగా మేనేజింగ్‌ట్రష్టీగా పెద్దకుమారులు వెంకట సుందర శాస్త్రిగారు బాధ్యత స్వీకరించిరి. అతని సోదరుడు సీతారామ శాస్త్రిగారిని అసిస్టెంటు మేనేజరుగా బోర్డువారు నియమించిరి. ఎడిషనల్ మేనేజింగ్ ట్రష్టీగా తమ తండ్రి హయామునుండి తమకు అండదండలందించుచున్న శ్రీ ముక్తేవి సీతారామయ్యగారి సహకారముతో, ఆశ్రమ వాసులకు ఆహోరాత్రములు విద్యుత్ సౌకర్యముతో గాలి, వెలుతురుకు ఆటంకము లేని విధముగా శబ్దముచేయని రెండు గొప్ప జనరేటర్లను, స్త్రీ, బాల, వృద్ధులు శ్రమలేకుండ మొదటి, రెండవ అంతస్థులు చేరులాగున లిఫ్టు సౌకర్యమును సమకూర్చిరి.

కాశీవాసము : ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతి స్వాములవారు మోక్ష మార్గమునకు ప్రాకులాడు ముముక్షువుల తీవ్ర కాంక్షను దూరదృష్టి తో పరికించి, ఆశ్రమములోని కొన్ని గదులను యోగ్యులయిన భక్తులకు వారు ఆమరణాంతము కాశీలో నివసించుటకు వీలుగా కేటాయిస్తూ, ట్రష్టు డీడులో పొందు పరిచిరి. ఈ వసతిని సాధ్యమైనంత ఎక్కువ మందికి కల్పించుటకు వీలుగా సవరించి 9 మాసముల 9 దినములు కాశీ వాసము చేయుటకు ఏర్పరిచి అట్టి వసతి అప్లికేషను క్రమసంఖ్యననుసరించి కల్పింపబడుచున్నది.

        అట్టి కాశీ వాసులు తమ నియమితకాలములో ఆశ్రమ నియమావళి ప్రకారము కాశీ హద్దులలోనే నివసిస్తూ, నిత్యము విశ్వేశ్వర, కేదారేశ్వర దర్శనములతో, స్మరణ, పూజలతో కాలము గడుపుచూ ఆశ్రమములో జరుగు పూజా కార్యక్రమములలో చురుకుగా పాల్గొనుచు తమ జీవితములు ధన్యమైవనిగా భావించుచున్నారు.

ఆశ్రమములోని ఇతర వసతులు : పూర్వపు దినములలో కాశీ ప్రయాణము కష్టముతో కూడియుండెడిది. రైలు, విమాన ప్రయాణ సౌకర్యముల సౌలభ్యము వలన, టి.వి., తరచుగా ముద్రణ లోనికి వచ్చుచున్న తెలుగు గ్రంథముల వలన కాశీ క్షేత్రమహాత్మ్యము జనాకర్షకమై యాత్రికుల రద్దీ ఈ క్షేత్రమునకు పెరిగినది. అందు వలన సహజముగా ఆంధ్ర ఆశ్రమమునకు రద్దీ పెరిగినది. అసంఖ్యాకులుగా వచ్చు యాత్రికులకు సాధ్యమైనంత ఎక్కువసేవ జేయు తలంపుతో ఆశ్రమములో వసతి 9 రోజులకు, విశేష రద్దీ ఉండు కార్తీక మాసము, మహాశివరాత్రి మున్నగు పర్వదినములలో 3 రోజులకు కుదింపవలసి వచ్చుచున్నది. యాత్రికులు  వచ్చిన వెంటనే గదుల వసతి ఏర్పరచలేనప్పుడు వారి తాత్కాలిక వసతి కొరకు లాకరు సౌకర్యము కల్పింపబడినది. ఈ సౌకర్యమును వినియోగించుకొని, యాత్రికులు గంగాస్నానము, ఈశ్వర దర్శనము, తీర్థవిధులు సకాలములో చేసుకొని సంతృప్తిని పొందుచున్నారు. 30 లాకర్లలో షుమారు 100 మంది యాత్రికులకు వసతి లభించుచున్నది.

        కాశీలోని విశేష వాతావరణ మార్పుల వలన వేసవి కాలము భరింపరాని ఎండలు, వేడి గాలులు ఉండును. ఇప్పటి కాలమునకు అనుగుణముగా ఆశ్రమములోని కొద్ది గదులకు ఏ.సి. సౌకర్యము కల్పింపబడినది.

ప్రయాణ సౌకర్యములు : కాశీ క్షేత్రమును దర్శించి తీర్థ విధులను ముగించుకొన్న యాత్రికులకు ఈ క్షేత్రమందలి దర్శనీయ స్థలములు, దగ్గరలో ఉన్న ప్రయాగ, గయ, అయోధ్య, నైమిశారణ్యము వంటి పుణ్య క్షేత్రములదర్శనము, అక్కడి పుణ్య కార్యములు చేయుటయందాసక్తి ఉండుట సహజము. వారికి అనుకూలమైన ఏర్పాట్లు చేయుటకు వీలుగా ఆశ్రమ ఆవరణములో ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేయబడినది. అచ్చటనే పి.సి.ఓ. సదుపాయము ఉండి దేశములోను, ఇతర దేశములలోను ఉన్న తమవారితో సంభాషించువీలు కలిగి యాత్రికుల అవసరములు తీర్చుట జరుగుచున్నది. రైలు, విమాన రిజర్వేషను సౌకర్యము యాత్రికులకు ఉపయోగకరముగా ఉన్నది.

ఆశ్రమమును దర్శించిన ప్రముఖులు : పవిత్ర క్షేత్రమును దర్శించిన ఆంధ్ర ప్రముఖులు ఇచ్చటి ఆంధ్ర ఆశ్రమమును దర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులు అందజేయుట పరిపాటిగా జరుగుచున్నది. ఆశ్రమ స్థాపనకు మొదటి సహాయ సహకారములందిచిన ప్రముఖుల వివరములను వివరించుట జరిగినది. ఇటీవలికాలములో జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠీధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, ఆశ్రమమును దర్శించి వారి ఆశీస్సులనందజేసిరి. ఇంకను శ్రీశ్రీశ్రీ కుర్తాళం పీఠీధిపతులు, విశాఖ పట్టణము శీరదా పీఠాధిపతులు తమ చాతుర్మాస్య దీక్షలను కాశీలో కొనసాగించి ఆంధ్ర ఆశ్రమమునందు ఉండి నిత్య ఉపాసనా, హోమ కార్యక్రమములతోను, అనుగ్రహ భాషణములతోను యాత్రిక భక్తులను, కాశీ వాసులను, తమ ప్రియ శిష్యులను ధన్యులను గావించిరి. సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు వారి కాశీయాత్ర సమయములో ఆశ్రమమునకు విచ్చేసి ఆశీస్సులు తెలిపిరి.

        ఇంకను ప్రముఖులు సిక్కిం మాజీ గవర్నరు శ్రీ వి. రామారావుగారు,  ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు, విశ్వహిందూ పరిషత్ అద్యక్షులు శ్రీ అశోక్ సింఘల్ గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, ప్రముఖ గాయకులు పద్మశ్రీ డా. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగారు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు ఇంకనూ ఎంతోమంది పేరు ప్రఖ్యాతులున్న మహనీయులు కాశీ క్షేత్రమును, ఆంధ్ర ఆశ్రమమును దర్శించి ఆశ్రమ అభివృద్ధికి తమ అనుగ్రహ ఆశీస్సుల నందజేయు చున్నారు.

శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు ఆశ్రమ కట్టడమునకుగాను మేస్త్రీలు, కూలీలతో వారి భాషలలో మాట్లాడి పనులు చేయించుకొనుచు, గుమాస్తాలను నియమించి ఎంతో శ్రమతో ఆశ్రమము నిర్మింపగా, ట్రష్టీలలో చాలా సన్నిహితులనుండియు, ఆశ్రమము ఇరువైపులనుండు వారినుండియు వాజ్ఞ్మూలముగను, వ్రాతపూర్వకముగను, కోర్టు ద్వారాకూడాను ఎన్నో ఇబ్బందులనధిగమించి శ్రీస్వామివారి తపోబలము వలనను శ్రీ సీతారామచంద్రుల పరిపూర్ణ అనుగ్రహముచేతను, ఆశ్రమము మొదటి అంతస్థును రెండవ అంతస్థులో కొంతభాగాన్ని కట్టించి, అందు శ్రీసీతా లక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామి వారిని మందిరమున ప్రతిష్ఠింపజేసి, మానసేశ్వరస్వామిగా శివ ప్రతిష్ఠగావించిరి.

        ఆశ్రమ నిర్వహణ తమ తపోనిష్ఠకు భంగకరముగాకుండ గుమాస్తాలతో జరిపించుట కష్టతరముగా తలంచిన శ్రీశ్రీశ్రీ స్వామివారు, వేరు మార్గము గానక 1966 వ సం. లో వారి పూరావాశ్రమ కనిష్ఠపుత్రులగు వేమూరి శ్రీరామచంద్రమూర్తిగారిని వారు అప్పుడు చేయుచున్న మిలిటరీ ఉద్యోగమును మాన్పించి సకుటుంబముగ కాశీకి రప్పించిరి. శ్రీరామచంద్రమూర్తిగారు ఆశ్రమ మేనేజరుగా బాధ్యత స్వీకరించి తండ్రికి తగిన బిడ్డగా, యాత్రీకులకు సకల సౌకర్యములు కల్పించుటయందు శ్రద్ధతో నిత్యము శ్రీ మానసేశ్వర, శ్రీ సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీ కోదండరామస్వామివారి సేవలతో ఆశ్రమ నిర్వహణ బాధ్యత సమర్ధవంతముగ నిర్వహించిరి. అప్పటినుండి శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు తపోయోగ నిష్ఠులై వయోభారముచే ది. 12.12. 1983న కాశీలో వారు స్థాంపించిన ఆశ్రమమునందు శివసాయుజ్యము పొందిరి.

కాశీయాత్రచేయు ఆంధ్ర యాత్రిక భక్తులకు పెట్టని కోటగా వసతులు కల్పించుచున్న ఆంధ్ర ఆశ్రమమునకు స్వాములవారి సేవకు నిరంతర స్మరణ చిహ్నముగా వారి విగ్రహము ఆశ్రమములోని శివాలయమునకు దగ్గరలో కుటీరమందు స్థాపింపబడినది. శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి పీఠాధిపతులవారిచే ఈ కార్యక్రమము 23.4.2000 సం. న నిర్వర్తించబడినది.
శ్రీ రామచంద్రమూర్తిగారు ఆశ్రమ పురోభివృద్ధికై అహరహము పాటుపడి సంకటములనెదుర్కొనుటకు శ్రీ గణపతిని ప్రార్థించి 1987 వ సంవత్సరమునుండి శ్రీరామనవమి ఉత్సవములు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవములకు తోడుగ, వారి పెద్దకుమారుడైన శ్రీ వేమూరి వెంకట సుందరశాస్త్రిగారి ప్రోత్సాహముతో గణపతి నవరాత్ర మహోత్సవములారంభించి సమర్ధవంతముగ నిర్వర్తించుచుండిరి. ఈ కార్యక్రమము నిర్వరామముగా ఇప్పటివరకు జరుగుచునే యున్నది. ఈ ఉత్సవము 9 రోజులు ఉదయము సాయంత్రము గణపతి పూజలు, సాంస్కృతిక కార్యక్రమములతో సహా జరిపి చివరి రోజున ఊరేగింపుతో గణపతినిమజ్జనము గంగానదిలో జరుపబడుచున్నది.

        గణపతి నవరాత్రి ఉత్సవములతో పాటు, ఈ దిగువ పేర్కొన్న విశిష్ట కార్యక్రమములు భక్తి, శ్రద్ధలతో ఆశ్రమములో నిర్వహించబడుచున్నవి.
(అ)   శ్రీరామనవమి ఉత్సవము : 4 దినములు నిర్వహించబడుచున్నవి
శ్రీరామనవమినాడు శ్రీ సీతారామచంద్రుల కల్యాణము, రెండవ రోజున 10 మంది భక్తులతో లక్షతులసి అర్చన, సీతమ్మవారికి ముత్తయిదువులతో లక్షకుంకుమార్చన, మూడవ రోజు గంగాతీరమున అవబృధస్నానము, తదుపరి శ్రీరాములవారి పట్టాభిషేకము, అన్నపూర్ణా సమేత మానసేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన, నాల్గవరోజు ఆంజనేయస్వామివారికి ఆకుపూజ, సాయంత్రము శ్రీరామచంద్రులవారికి తెప్పోత్సవము.
(ఆ) మహాశివరాత్రి పూజలు : మహాపర్వదినమైన మహాశివరాత్రి సమయమునందు నాలుగు యామములలోను అన్నపూర్ణ సమేత మానసేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్ష బిల్వార్చన జరుపబడుచున్నది. రాత్రి అంతయు అనేక భక్తి కార్యక్రమములు సాగించుచు జాగరణ చేయుదురు.
(ఇ) కార్తీక మాస పూజలు : హరిహరులకిర్వురకు ప్రీతికరమైన కార్తీక మాసమునందు ఆంధ్రదేశము నలుమూలల నుండి భక్త సందోహము కాశీకి వచ్చి ఆశ్రమములో విడిది చేసి నిత్యము ఆశ్రమము ఆధ్వర్యములో మానసేశ్వరస్వామివారికి అభిషేకములు, కార్తీక దామోదర పూజ, లక్ష బిల్వార్చనల వంటి పూజలతో వారు తన్మయులగుచు ఆశ్రమమునకు నిత్య కల్యాణము, పచ్చ తోరణము శోభను తీసుకొని వత్తురు. ఈ మాసపు పూజలు ఆశ్రమ స్థాపననుండి నిరాటంకముగా సాగుచున్నవి.  కార్తీక పౌర్ణమినాడు లక్ష బిల్వార్చన శివ పార్వతుల కల్యాణము, భజన కార్యక్రమము జరుపబడును.
(ఈ) ధనుర్మాస పూజలు : శ్రీ రంగనాథునకు ప్రీతికరమైన ధనుర్మాసమునాడు మాసమంతయు వేకువ ఝామునే శ్రీరామమందిరమునందు ధనుర్మాస పూజలు, తీర్థ ప్రసాద వితరణ మున్నగు భక్తి కార్యక్రమములు నిర్విఘ్నముగా జరుగుచున్నవి. వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వార దర్శనము, మందిర ప్రదక్షిణములు, భజనలు, అలంకారములు అన్నయి నయనానందకరముగా సాగుచున్నవి.
(ఉ) సంధ్య హారతులు : 2009 మహాశివరాత్రి పర్వదినము నుండి, మేనేజింగు ట్రష్టీ శ్రీ సుందరశాస్త్రిగారి ఆధ్వర్యములో, ఆశ్రమములో వెలసియున్న రాధా కృష్ణ మందిరము, రామమందిరము, స్వాములవారి కుటీరము, రామనామ స్థూపము, శివాలయము, గంగాధర మూర్తి మరియు గంగామాతకు సంధ్య హారతులు నిర్వర్తింపబడుచున్నవి. యాత్రిక భక్తు ఆదరాభిమానములతో సలక్షణముగా జరుగుచున్నవి.

(ఊ) హోమములు : లోకకల్యాణార్ధము, యాత్రికులకు నిరంతర సేవచేయుచున్న ఆశ్రమము అభివృద్ధి కొఱకు ప్రతి మాస శివరాత్రనాడు రుద్రహోమము, ప్రతి శుక్ల అష్టమినాడు చండీ హోమము ఋత్విక్కుల సహాయముతో, కాశీ వాసుల, భక్త జనుల సహకారముతో జరుపబడుచున్నవి.

పూజలు వివరములు
శ్రీరామ నవమి పూజ
 సీతారామ కళ్యాణము, లక్షతులసిపూజ, లశ్ర కుంకుమార్చన, శ్రీరామ పట్టాభిషేకము, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, లక్షపత్రిపూజ, అన్నదానము, తెప్పోత్సవము, గంగపూజ, పవళింపుసేవలు జరుపబడును. విరాళము. రూ.11116/-లు అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
మహాశివరాత్రి పూజ-
 ఆరోజు ఉదయం నుండి మరునాడు ఉదయం వరకు అభిషేకములు రాత్రికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు, మరునాడు బ్రాహ్మణ సమారాధన, బీదలకు అన్నదానము, ఋత్విక్కులకు సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
కార్తీక పౌర్ణమి పూజ– 
మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, ఈశ్వరునకు సహస్ర బిల్వార్చన, అన్నపూర్ణ అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, ఆకాశదీపము, ఆలయము చుట్టూ దీపాలంకరణ, బ్రాహ్మణ సత్కారము జరుపబడును. విరాళము రూ.1116/- అక్కౌంటు నంబరు UNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200
గణపతి నవరాత్రి ఉత్సవమలు భాద్రపద శుక్ల చతుర్ది వినాయకచవితి నుండి 9 రోజులు ప్రత్యేక పూజలు జరుపబడును. విరాళము రూ.1116/-. అక్కౌంటు నంబరుUNION BANK OF INDIA, LUXA ROAD BRANCH, VARANASI S/B AC. NO062010011016341-IFS CODE UBIN0806200

విరాళము లిచ్చిన దాతలకు ఇన్ కంటాక్స్ సెక్షన్ 80జి  ప్రకారము రాయతీ కలదు

        శ్రీ శ్రీరామచంద్రమూర్తిగారు తరచు ఆంధ్రదేశ పర్యటన గావించుచు వదాన్యులనాశ్రయించి సంపాదించిన ధనముతో శ్రీరామతారక ఆంధ్రాశ్రమమున రెండవ అంతస్థులోని గదులన్నియూ నిర్మించి మొత్తము రెండతస్థులలోనూ కలిపి వంటగది, లెట్రినుతో గల 45 సూట్లు, 71 విడి గదులు, మొదటి అంతస్థులోరామమందిరముపైన పెద్ద హాలును నిర్మించి మొత్తము 800 మంది యాత్రికులు బసచేయుటకు తగిన వసతి, బాత్‌రూములు, లెట్రినులతో యాత్రికుల సౌకర్యమే ధ్యేయముగ సేవచేయుచుండిరి. వారి ఆధ్వర్యములో జనరేటరు స్థాపింపబడి, లిఫ్టు సౌకర్యము కొరకు పనులు ప్రారంభించబడినవి.

        శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు తమ కుమారులగు చి. వెంకట సుందర శాస్త్రి, చి. వెంకట సీతారామ శాస్త్రి గారలకు ఆశ్రమ నిర్వహణలోని మెళకువలను నేర్పి వారిని తీర్చి దిద్దిరి. మధ్య కుమారుడగు చి. వెంకట విశ్వనాథ శాస్త్రికి సంగీత సాధనలో గల ఆసక్తిని గ్రహించి విజయనగర సంగీత కళాశాలయందు సంగీతము నేర్పించిరి. ఆ విధముగ తండ్రి, కుమారుల ఆధ్వర్యమున మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుచున్న సమయమున శ్రీరామచంద్రమూర్తి గారు వృధ్ధాప్యమున అస్వస్థులై ది. 20.7.2008 న శ్రీ విశ్వనాథ స్వామి వారిచే రామతారక మంత్రోపదేశము పొంది శివైక్యమందిరి.
తదనంతరము సుశిక్షితులగు అన్నదమ్ములు శ్రీశ్రీ రామభద్రేంద్ర సరస్వతీ స్వామివారు అవసాన కాలమున తమ విల్లులో వ్రాసి ట్రష్టు బోర్డుచే ఆమోదము పొందిన విధముగా మేనేజింగ్‌ట్రష్టీగా పెద్దకుమారులు వెంకట సుందర శాస్త్రిగారు బాధ్యత స్వీకరించిరి. అతని సోదరుడు సీతారామ శాస్త్రిగారిని అసిస్టెంటు మేనేజరుగా బోర్డువారు నియమించిరి. ఎడిషనల్ మేనేజింగ్ ట్రష్టీగా తమ తండ్రి హయామునుండి తమకు అండదండలందించుచున్న శ్రీ ముక్తేవి సీతారామయ్యగారి సహకారముతో, ఆశ్రమ వాసులకు ఆహోరాత్రములు విద్యుత్ సౌకర్యముతో గాలి, వెలుతురుకు ఆటంకము లేని విధముగా శబ్దముచేయని రెండు గొప్ప జనరేటర్లను, స్త్రీ, బాల, వృద్ధులు శ్రమలేకుండ మొదటి, రెండవ అంతస్థులు చేరులాగున లిఫ్టు సౌకర్యమును సమకూర్చిరి.

కాశీవాసము : ఆశ్రమ వ్యవస్థాపకులైన శ్రీశ్రీశ్రీ ప.ప. రామభద్రేంద్ర సరస్వతి స్వాములవారు మోక్ష మార్గమునకు ప్రాకులాడు ముముక్షువుల తీవ్ర కాంక్షను దూరదృష్టి తో పరికించి, ఆశ్రమములోని కొన్ని గదులను యోగ్యులయిన భక్తులకు వారి ఆమరణాంతము కాశీలో నివసించుటకు వీలుగా కేటాయిస్తూ, ట్రష్టు డీడులో పొందు పరిచిరి. ఈ వసతిని సాధ్యమైనంత ఎక్కువ మందికి కల్పించుటకు వీలుగా సవరించి 9 మాసముల 9 దినములు కాశీ వాసము చేయుటకు ఏర్పరిచి అట్టి వసతి అప్లికేషను క్రమసంఖ్యననుసరించి కల్పింపబడుచున్నది.

        అట్టి కాశీ వాసులు తమ నియమితకాలములో ఆశ్రమ నియమావళి ప్రకారము కాశీ హద్దులలోనే నివసిస్తూ, నిత్యము విశ్వేశ్వర, కేదారేశ్వర దర్శనములతో, స్మరణ, పూజలతో కాలము గడుపుచూ ఆశ్రమములో జరుగు పూజా కార్యక్రమములలో చురుకుగా పాల్గొనుచు తమ జీవితములు ధన్యమైవనిగా భావించుచున్నారు.

ఆశ్రమములోని ఇతర వసతులు : పూర్వపు దినములలో కాశీ ప్రయాణము కష్టముతో కూడియుండెడిది. రైలు, విమాన ప్రయాణ సౌకర్యముల సౌలభ్యము వలన, టి.వి., తరచుగా ముద్రణ లోనికి వచ్చుచున్న తెలుగు గ్రంథముల వలన కాశీ క్షేత్రమహాత్మ్యము జనాకర్షకమై యాత్రికుల రద్దీ ఈ క్షేత్రమునకు అందు వలన సహజముగా ఆంధ్ర ఆశ్రమమునకు పెరిగినది. అసంఖ్యాకులుగా వచ్చు యాత్రికులకు సాధ్యమైనంత ఎక్కువసేవ జేయు తలంపుతో ఆశ్రమములో వసతి 9 రోజులకు, విశేష రద్దీ ఉండు కార్తీక మాసము, మహాశివరాత్రి మున్నగు పర్వదినములలో 3 రోజులకు కుదింపవలసి వచ్చుచున్నది. యాత్రికులు  వచ్చిన వెంటనే గదుల వసతి ఏర్పరచలేనప్పుడు వారి తాత్కాలిక వసతి కొరకు లాకరు సౌకర్యము కల్పింపబడినది. ఈ సౌకర్యమును వినియోగించుకొని, యాత్రికులు గంగాస్నానము, ఈశ్వర దర్శనము, తీర్థవిధులు సకాలములో చేసుకొని సంతృప్తిని పొందుచున్నారు. 30 లాకర్లలో షుమారు 100 మంది యాత్రికులకు వసతి లభించుచున్నది.

        కాశీలోని విశేష వాతావరణ మార్పుల వలన వేసవి కాలము భరింపరాని ఎండలు, వేడి గాలులు ఉండును. ఇప్పటి కాలమునకు అనుగుణముగా ఆశ్రమములోని కొద్ది గదులకు ఏ.సి. సౌకర్యము కల్పింపబడినది.

ప్రయాణ సౌకర్యములు : కాశీ క్షేత్రమును దర్శించి తీర్థ విధులను ముగించుకొన్న యాత్రికులకు ఈ క్షేత్రమందలి దర్శనీయ స్థలములు, దగ్గరలో ఉన్న ప్రయాగ, గయ, అయోధ్య, నైమిశారణ్యము వంటి పుణ్య క్షేత్రములదర్శనము, అక్కడి పుణ్య కార్యములు చేయుటయందాసక్తి ఉండుట సహజము. వారికి అనుకూలమైన ఏర్పాట్లు చేయుటకు వీలుగా ఆశ్రమ ఆవరణములో ట్రావెల్స్ సంస్థ ఏర్పాటు చేయబడినది. అచ్చటనే పి.సి.ఓ. సదుపాయము ఉండి దేశములోను, ఇతర దేశములలోను ఉన్న తమవారితో సంభాషించువీలు కలిగి యాత్రికుల అవసరములు తీర్చుట జరుగుచున్నది. రైలు, విమాన రిజర్వేషను సౌకర్యము యాత్రికులకు ఉపయోగకరముగా ఉన్నది.

ఆశ్రమమును దర్శించిన ప్రముఖులు : పవిత్ర క్షేత్రమును దర్శించిన ఆంధ్ర ప్రముఖులు ఇచ్చటి ఆంధ్ర ఆశ్రమమును దర్శించి వారి అనుగ్రహ ఆశీస్సులు అందజేయుట పరిపాటిగా జరుగుచున్నది. ఆశ్రమ స్థాపనకు మొదటి సహాయ సహకారములందిచిన ప్రముఖుల వివరములను వివరించుట జరిగినది. ఇటీవలికాలములో జగద్గురువులు శ్రీశ్రీశ్రీ కంచి కామకోటి పీఠీధిపతులు, పుష్పగిరి పీఠాధిపతులు, ఆశ్రమమును దర్శించి వారి ఆశీస్సులనందజేసిరి. ఇంకను శ్రీశ్రీశ్రీ కుర్తాళం పీఠీధిపతులు, విశాఖ పట్టణము శీరదా పీఠాధిపతులు తమ చాతుర్మాస్య దీక్షలను కాశీలో కొనసాగించి ఆంధ్ర ఆశ్రమమునందు ఉండి నిత్య ఉపాసనా, హోమ కార్యక్రమములతోను, అనుగ్రహ భాషణములతోను యాత్రిక భక్తులను, కాశీ వాసులను, తమ ప్రియ శిష్యులను ధన్యులను గావించిరి. సద్గురు శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు వారి కాశీయాత్ర సమయములో ఆశ్రమమునకు విచ్చేసి ఆశీస్సులు తెలిపిరి.

        ఇంకను ప్రముఖులు సిక్కిం మాజీ గవర్నరు శ్రీ వి. రామారావుగారు, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు, విశ్వహిందూ పరిషత్ అద్యక్షులు శ్రీ అశోక్ సింఘల్ గారు, శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు, ప్రముఖ గాయకులు పద్మశ్రీ డా. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంగారు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు ఇంకనూ ఎంతోమంది పేరు ప్రఖ్యాతులున్న మహనీయులు కాశీ క్షేత్రమును, ఆంధ్ర ఆశ్రమమును దర్శించి ఆశ్రమ అభివృద్ధికి తమ అనుగ్రహ ఆశీస్సుల నందజేయు చున్నారు.

Translate »