bb2
bb3
ashram1
bannerdd
bb4
previous arrow
next arrow

అన్నదాన కార్యక్రమము : ఆశ్రమమునకు వచ్చు భక్తులు ఆంధ్ర దేశ ప్రాంతమువారగుటచే వారికి ఉత్తర హిందూదేశ సాంప్రదాయము ప్రకారము కాశీలో లభించు భోజన వసతి అననుకూలముగా భావింతురు. వారి కోరిక ననుసరించి వారి సౌకర్యార్ధము నిత్య అన్నదాన పధకము ప్రారంభించబడినది. వ్యయ ప్రయాసలతో కూడినదయినను ఈ పధకము 30.4.2001 న శ్రీ కాశీ కుసుమాంబ నిత్యాన్నదానమను పేర స్థాపింపబడి షడ్రసోపేతముగా భోజన వసతి కల్పించి, సమర్ధవంతముగా నిర్వహించబడుచున్నది. వదాన్యులయిన భక్తుల విరాళములతోను, భక్తి వ్శ్వాసములతో సేవచేయుచున్న వంట, వడ్డన, వార్పు సిబ్బందితోను, అక్కౌంట్లు, గోత్రనామముల పట్టికలను తయారుచేయు సిబ్బందితోను, ఈ కార్యక్రమము మూడు పువ్వులు, ఆరు కాయలు గా నడుస్తూ యాత్రికుల ప్రశంశలను అందుకొనుచున్నది.

image
image
image
image
image
image

    శ్రీ స్వాములవారి ట్రష్టు డీడు ప్రకారము చాతుర్వర్ణములవారికి గదుల వసతి కల్పించు ఈ ఆశ్రమములో బసచేయు యాత్రికులకు పగలు భోజనము (పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు, ప్రత్యేక తీపిగాని కారపు పదార్ధముగాని కలిపి), సాయంకాలము ఫలహారము ఏర్పాటు చేయబడుచున్నది. సగటున రోజుకు 250 మందికి – రద్దీగా ఉన్న సమయములలో 400 మందికి, ఈ భోజన వసతి నిర్విఘ్నముగా కల్పింపబడుచున్నది. విరాళములిచ్చు భక్తులకు వారు కోరిన దినమున గాని, తేదీన గాని అన్నదానము జరుపబడుచూ, వారికి ముందుగా తెలియజేయు ఏర్పాటు కలిగి యున్నది.

శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమములోనే నిత్యాన్నదానం
ప్రతి రోజు ఆంధ్రదేశములోని అన్ని ప్రాంతముల నుండి వేలాది మంది యాత్రికులు, భక్తులు ఆంధ్రాశ్రమం వచ్చి ఆంధ్రాశ్రమంలో గల 110 గదులలో వసతి ఏర్పాటుచేసుకొని వారి కార్యక్రమమలు చేసుకొనుచున్నారు. కావున ఆంధ్రాశ్రమములోనే యాత్రికులకు అందుబాటుగా అన్నదానకార్యక్రమము చేయుటవలన శ్రమ లేకుండ స్త్రీ, వృద్ధులకు మిక్కిలి సౌకర్యముగా ఉండునని యాత్రీకుల కోరుచున్నారు.కావున దాతలు గమనించి, సహకరించగలరు.
అన్నదానమునకు దాతలు ఇచ్చే విరాళములు – విధానము

  1. రు58,500.00లు చెల్లించన దాత పేరు నిత్యాన్నదాన పధకమలో చేర్చి 20 సంపత్సరాల వరకు భోజనశాలలో మహరాజపోషకులుగా వీరి పేరు యాత్రికులకు తెలియజేయబడును.
  2. రు.32,500.00లు చెల్లించిన దాత పేరు, నిత్యాన్నదాన పధకమలో రాజపోషకులుగా చేర్చి 20సంపత్సరాలు ప్రతిరోజు భోజనశాలలో యాత్రికులకు వీరి పేరు తెలియజేయబడును. ప్రతి రోజు ఒక్కరికి దాత పేరు మీద భోజన ఏర్పాటు చేయగలము
  3. రు. 25,500.00లు చెల్లించిన దాతపేరు, నిత్యాన్నదాన పధకములో 12సంవత్సరాల వరకు పోషకులుగా చేర్చి భోజనశాలలో యాత్రికులకు వీరిపేరు తెలియజేయబడును. ప్రతి రోజు ఒక్కరికి దాత పేరు మీద భోజన ఏర్పాటు చేయగలము
  4. రు.10,500.00లు చెల్లించిన దాతలపేర సంవత్సరమునకు 10 రోజులు భోజనము ఏర్పాటుచేసి, 12సంవత్సరాల వరకు బోర్డుపైన వీరి పేరు వ్రాసి తెలియజేయబడును.
  5. రు5,500.00లు చెల్లించిన దాతల పేర సంవత్సరమునకు 5 రోజులు భోజమను ఏర్పాటుచేసి, 12సంవత్సరాల వరకు బోర్డుపైన వీరిపేరు వ్రాసి తెలియజేయబడును.
  6. రు.1,750.00లు చెల్లించిన దాతల పేర సంవత్సరమునకు ఒకరోజు చొ.న 12 సంవత్సరాల పాటు అన్నదానము చేయబడును.

పైన ప్రకటించిన విధముగా గాక ఇతరవిధముగ విరాళమలు ధనరూపములోను, వస్తురూపములోను స్వీకరింపబడును. కావున దాతలు భూరివిరాళములు అందజేసి, మీపితృదేవతలను సంతృప్తిపరుస్తూ శ్రీ కాశీ అన్నపూర్ణా విశ్వనాథుల మరియు శ్రీ సీతారామస్వామివార్ల ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము.

అన్నదాతలు ఇవ్వవలసిన వివరములు
1.దాత పేరు-
2.ఎవరి పేరున అన్నదానము చేయవలసినది-
3.గోత్రము-
4.ఏమాసము లో ఏతిథి (తేది) రోజున చేయవలసినది-
5.పూర్తి అడ్రసు-
దాతలు తమ విరాళములను “SRI RAMATARAKA KUSUMAMBA KASI NITYANNADANA PADHAKAM, VARANASI”  పేరున డి.డి  రూపమున వారణాశి లో చెల్లుబడి అగునట్లు తీసి పంప గలరు.
లేదా UNION BANK OF INDIA ONLINE ACCOUNT NUMBER : 062010011016341-IFS CODE UBIN0806200 ద్వారా జమ చేసి పై వివరములు తెలుపుతూ ఇ-మెయిల్ పంప గలరు

విరాళము లిచ్చిన దాతలకు ఇన్ కంటాక్స్ సెక్షన్ 80జి  ప్రకారము రాయతీ కలదు. దాతలు ఆధార్ నం. కాని పాన్ నం. కాని తప్పనిసరిగా జతపరచవలెను

Translate »