కాశి లోకాశి విశ్వనాధుడి సన్నిధిలో శ్రీ శ్రీ శ్రీ రామ భదేంద్ర సరస్వతి స్వామివారి చే స్థాపించబడిన శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం ఈరోజుకి 58 సంత్సరాలు పూర్తి చేసుకుంది. 12-11-1959 న అప్పటి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీ వి వి గిరి గారి ద్వారా శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కాశీకి వచ్చే మన తెలుగు యాత్రికులకు ఆశ్రమం వసతి,భోజనములు, మెడికల్ సౌకర్యం, పూజా కార్యక్రమాలు. ట్రావెల్స్, యాత్రికులకు కావలసిన సౌకర్యాలు సహాయములు అందచేయు చున్నాము. ఇప్పుడు ఆశ్రమానికి 3 భవనములు ఉన్నాయి. కాశివాసులకు భవనం లో 15 రూమ్స్. యాత్రికులకు 150 రూమ్స్, హల్స్ ఉన్నాయి. ఆశ్రమం ట్రస్ట్ బోర్డ్ వారి సహాయ సహకరములతో, దాతలవిరాళములతొ, ఆశ్రమం సిబ్బంది సహకారంతో, మా పరివారం సపోర్ట్ తో ఆశ్రమం దిన దినాది అభివృద్ధి చెందుతోంది.
అందరికి మా ధన్యవాదాలు.
వి వి సుందర శాస్త్రి
మనేజింగ్ ట్రష్టీ


